నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి 1,079 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు ఇంటర్ ( లేదా ) ఐటిఐ పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు, ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో మొత్తం 23 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 1, 079 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు


విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఇంటర్ ( లేదా ) ఐటిఐ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు
వయస్సు :
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 19. 05.2026 నాటికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి . అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి SC / ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి మూడు సంవత్సరాలు PWD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి 10 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తుంది.

Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి రైల్వే డిపార్ట్మెంట్ కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున అందరూ www.apprenticeship.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడి నుండి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ మొత్తం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 19.05.2026
Apply చేయడానికి చివరి తేది : 18.06.2026
Official Notification : Click here




